Home » New Delhi
భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. భారీ వర్షాలతో ఢిల్లీ, పంజాబ్‌తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీవర్షాల ధాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 151 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కాస్త ఆలస్యం కానుంది. ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. ఒక రోజు ఆలస్యంగా జులై 14న రాకెట్‌ను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఒక కోతి చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కోతి చెట్టుపై కూర్చుంది. దిగిరమ్మంటే ఎంతకీ రాలేదు. చివరకు చేసేదేం ఏం లేక.. పాపం ఆ బ్యాగ్ యజమాని.. ‘‘నా బ్యాగ్ నాకు ఇవ్వవే.. అందులో లక్ష రూపాయలున్నాయే.. కావాలంటే అందులో నుంచి కొంత డబ్బుతో నీకు తినడానికి ఏమైనా ఇప్పిస్తాను’’ అన్నట్లుగా వేడుకున్నాడు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవానల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లోనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. ‘నో-ఫ్లైయింగ్ జోన్’లో డ్రోన్లు కనిపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
తండ్రి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ కొడుకు రహస్యంగా ఫోన్లో కెమెరా ఆన్ చేసి అతని రూంలో పెట్టాడు. కానీ ఆ తర్వాత ఫోన్లో రికార్డైంది చూశాక ఆ కొడుకుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి సదరు తండ్రి అక్కడ చేసింది చేతబడి కాదు. కానీ, అంతకుమించే చేశాడు.
దేశంలో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బోఫాల్ వేదికగా మాట్లాడటంతో దీనిపై రాజకీయ పార్టీల్లో చర్చ ఊపందుకుంది. తాజాగా యూసీసీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే, దీనిపై అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృత చర్యలు జరపాలని పేర్కొంది.
తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్ రావ్ థాక్రే తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 100 శాతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారన్నారు.